అమరావతిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు వినతి
GNTR: అమరావతిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాష్ట్ర టీడీపీ కార్యాలయంలో మంత్రి నారా లోకేశ్‌ను అబ్దుల్ కలామ్ కమిటీ ప్రతినిధులు కలిశారు. రాజధానిలో సైన్స్ మ్యూజియం ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనివల్ల భవిష్యత్ తరాలకు, విద్యార్థులకు ఎంతో విజ్ఞానం లభిస్తుందని కమిటీ సభ్యులు వివరించారు. వారి విజ్ఞప్తిపై మంత్రి లోకేశ్ సానుకూలంగా స్పందించారు.