నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

నేడు విద్యుత్ సరఫరాకు అంతరాయం

VSP: ఆనందపురం మండలం శొంఠ్యాం సబ్‌స్టేషన్ పరిధిలోని జి.ఎస్. అగ్రహారం, దబ్బంద ఫీడర్కు మరమ్మతులు చేపట్టనున్నట్లు విద్యుత్ శాఖ జోన్-3 ఎక్జిక్యూటివ్ ఇంజినీర్ బి.సింహాచలం నాయుడు తెలిపారు. ఈ పనుల కారణంగా శుక్రవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు చెప్పారు. గండిగుండం, దబ్బంద గ్రామాలకు విద్యుత్ ఉండదని అన్నారు.