మర్రిపూడిలో రెవెన్యూ సదస్సు నిర్వహణ

ప్రకాశం: మర్రిపూడి మండల కేంద్రంలో గురువారం రెవెన్యూ సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు ముఖ్య అతిథిగా స్థానిక తహసీల్దార్ నరసింహారావు పాల్గొన్నారు. పలువురు రైతుల వద్ద నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యల పరిష్కారమే రెవెన్యూ సదస్సుల ధ్యేయమన్నారు. ఎక్కువ శాతం అర్జీలు రెవెన్యూ సమస్యలపైనే వస్తున్నాయన్నారు.