​బైండోవర్లు ఉల్లంఘిస్తే జైలుకే: డీఎస్పీ

​బైండోవర్లు ఉల్లంఘిస్తే జైలుకే: డీఎస్పీ

SRPT: ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని సూర్యాపేట డీఎస్పీ ప్రసన్న కుమార్ కోరారు. శనివారం సూర్యాపేట నుంచి కుడకుడ వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాత నేరస్థులను రూ. 5 లక్షల పూచీకత్తుపై బైండోవర్ చేశామని, నిబంధనలు మీరితే జరిమానాతో పాటు రిమాండ్ తప్పదని హెచ్చరించారు. ఓటు హక్కు సక్రమంగా వినియోగించుకోవాలని అన్నారు.