రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం ఎంతంటే.?

రామలింగేశ్వర స్వామి హుండీ ఆదాయం ఎంతంటే.?

ATP: వజ్రకరూరు మండలంలోని ప్రసిద్ధి చెందిన జరుట్ల రామలింగేశ్వర స్వామి ఆలయంలో గురువారం ఉదయం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హుండీల ద్వారా రూ. 4,38,212 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈఓ కృష్ణయ్య తెలిపారు. ఆలయంలో మొత్తం రెండు హుండీలను దేవాదయశాఖ తనిఖీ అధికారి, గవిమఠం సహాయ కమిషనర్ రాణి ఆధ్వర్యంలో లెక్కించారు.