పులి దాడిలో ఆవు మృతి
MNCL: జన్నారం మండలంలోని ఇందన్ పల్లి శివారులో ఉన్న అటవీ ప్రాంతంలో పులి దాడి చేసిన సంఘటనలో ఆవు మృతి చెందిందని స్థానికులు తెలిపారు. గ్రామ శివారులోని భీమన్న గుట్ట సమీపంలోని మామిడి తోటలో బుధవారం ఆవు మృతి చెంది ఉండడాన్ని చూసి ఆందోళన వ్యక్తంచేశారు. దీనిపై జన్నారం ఎఫ్‌డీవొ రామ్మోహన్‌ను ప్రశ్నించగా.. గ్రామస్తులు అప్రమత్తంగా ఉండాలని, ఆవు మృతిపై పూర్తి విచారణ చేస్తామన్నారు.