కొడుకుతో దొంగతనాలు.. తల్లి, అక్క అరెస్ట్

కొడుకుతో దొంగతనాలు.. తల్లి, అక్క అరెస్ట్

కడపలో కొడుకుతో దొంగతనాలు చేయిస్తున్న తల్లి అమ్మాజాన్, అక్క కులాయమ్మను చిన్నచౌక్ పోలీసులు శనివారం అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరు ఐదు దొంగతనాల కేసుల్లో నేరాన్ని అంగీకరించినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి రూ.7.5 లక్షల విలువైన 50 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కడప ఎస్పీ విశ్వనాథ్ ఆదేశాల మేరకు DSP ఏ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో ఈ కేసును ఛేదించినట్లు వెల్లడించారు.