VIDEO: హరీష్ రావును పరామర్శించిన కేసీఆర్ సతీమణి
SDPT: మాజీ మంత్రి హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల మాజీ CM కేసీఆర్ సతీమణి శోభమ్మ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ రోజు ఆయన నివాసానికి చేరుకున్న శోభమ్మ పార్థీవదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. సత్యనారాయణ మరణం హరీష్ రావుకే కాదు.. BRS కుటుంబానికే తీరని లోటని అన్నారు.