తీవ్ర ఎండలు.. నిర్మానుష్యంగా రహదారులు..!

తీవ్ర ఎండలు.. నిర్మానుష్యంగా రహదారులు..!

ASR: కొయ్యూరు మండలంలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. శనివారం మధ్యాహ్నం 36.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గత వారం రోజుల నుంచి మండలంలో 25 డిగ్రీల నుంచి 36 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. ఎండ తీవ్రతకు ప్రజలు ఆపసోపాలు పడుతున్నారు. దీంతో మండలంలోని 516-ఈ జాతీయ రహదారి నిర్మానుష్యంగా మారింది.