నెల కూడా గడవకముందే నవవధువు బలవన్మరణం
NZB: ఆలూరు మండలం కల్లేడిలో తీవ్ర విషాదం నెలకొంది.పెళ్లై నెల రోజులు కూడా గడవకముందే నవవధువు ఆత్మహత్యకు పాల్పడటం స్థానికంగా కలకలం రేపింది. బాన్సువాడకు చెందిన అఖిలకు, కల్లేడికి చెందిన శ్రీకాంత్‌తో మార్చి 5న వివాహం జరిగింది. శుక్రవారం పుట్టింటి నుంచి అత్తారింటికి చేరుకున్న అఖిల శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ప్రాణాలు విడిచింది.