నేటి నుంచి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

నేటి నుంచి వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్

CTR: వ్యాధినిరోధక టీకాలు వేయించని ఐదేళ్ల లోపున్న పిల్లల కోసం ఈ నెల19 నుంచి 23తేది వరకు స్పెషల్ డ్రైవ్ ద్వారా టీకాలు వేయనున్నట్లు డీఐవో హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. వ్యాధి నిరోధక టీకాలు వేసుకోక పోవడంద్వారా అనేక రోగాల బారిన పడే అవకాశం ఉందన్నారు. వ్యాక్సిన్లు మిస్ అయిన తల్లిదండ్రులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకుని వ్యాక్సిన్లు వేయించాలన్నారు.