ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం: ఎస్పీ
SRPT: ప్రజల ఫిర్యాదులపై తక్షణమే స్పందించి, వేగంగా పరిష్కారం చూపాలని ఎస్పీ నరసింహ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజావాణి'లో ఆయన బాధితుల నుంచి విన్నపాలను స్వీకరించారు. ప్రజలు మధ్య వర్తులను ఆశ్రయించకుండా నేరుగా పోలీసులను కలవాలన్నారు. బాధితులకు న్యాయం చేస్తూ, శాంతిభద్రతల పరిరక్షణకు నిరంతరం కృషి చేస్తామని ఆయన భరోసా ఇచ్చారు.