48 గంటల్లో ఆలయాలు కట్టించాలి.. బండి సంజయ్ వార్నింగ్
PDPL: రామగుండంలో 46 మైసమ్మ ఆలయాల కూల్చివేతపై కేంద్రమంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.పెద్దపల్లి కలెక్టర్ శ్రీహర్ష, రామగుండం కమిషనర్ అరుణ శ్రీలకు ఫోన్ చేసి మండిపడ్డారు. రోడ్డు విస్తరణకు మసీదులను వదిలి, హిందూ ఆలయాలనే ఎందుకు కూల్చారని ప్రశ్నించారు. '48 గంటల్లో కూల్చిన ఆలయాలను పునరుద్ధరించాలి లేదా మసీదులను కూల్చివేయాలి అని హెచ్చరించారు.