'సమస్యల వెలికితీతలో జర్నలిస్టుల పాత్ర కీలకం'
KMM: అంతర్జాతీయ జర్నలిస్టుల దినోత్సవం సందర్భంగా ఏస్కూరు మండల కేంద్రంలో జర్నలిస్టులను కాంగ్రెస్ మండల నాయకులు శాలువాతో సన్మానించారు. ప్రజా సమస్యలను వెలికితీయడంలో, సమాజంలో ఏం జరుగుతుందో ప్రజలకు చేరవేయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. జర్నలిస్టులు మరింత ఉత్సాహంగా పని చేయాలని ఆకాంక్షించారు.