అంగన్వాడీ కేంద్రంలోకి వర్షపునీరు

KDP: వేంపల్లిలో గురువారం భారీ వర్షం కురిసింది. వీధులు జలమయం అయ్యాయి. అర్థకేజీ వీధిలోని అంగన్వాడీ కేంద్రంలోకి వర్షపు నీరు భారీగా చేరింది. దీంతో మోకాళ్ళ లోతు నీరు చేరడంతో పాలు, కందిపప్పు, బియ్యం తడిసిపోయాయి. వెంటనే స్థానికంగా ఉన్న ప్రజలు అప్రమత్తమై వాటిని బయటకు తీశారు. అప్పటికే బియ్యం పాలు కందిపప్పు పూర్తిగా తడిసిపోయినట్లు అంగన్వాడీ టీచర్ శైలజ వాపోయారు.