స్వదేశానికి 32 వేల మంది అమెరికన్లు 

స్వదేశానికి 32 వేల మంది అమెరికన్లు 

యుద్ధం నేపథ్యంలో పశ్చిమాసియాలో నివసిస్తున్న అమెరికన్లు స్వదేశానికి బయల్దేరుతున్నారు. ఇప్పటికే 32,000 మందికిపైగా అమెరికాకు చేరుకున్నారు. వారిలో చాలామంది సొంత ఖర్చుతోనే వచ్చారని అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. మిగిలినవారి కోసం ప్రత్యేకంగా విమానాలు సిద్ధం చేసినట్లు తెలిపింది. పశ్చిమాసియా దేశాల్లో ఉన్న అమెరికన్లు వీలైనంత త్వరగా ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చూస్తున్నారు.