మారిపోనున్న అనంతగిరి రూపురేఖలు

మారిపోనున్న అనంతగిరి రూపురేఖలు

VKB: అనంతగిరి అటవీ ప్రాంతం త్వరలో 'ఏకో టూరిజం' హబ్‌గా మారనుంది. సుమారు 3,750 ఎకరాల్లో విస్తరించిన ఈ ప్రాంతాన్ని రూ.1,000 కోట్ల అంచనా వ్యయంతో అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అడ్వెంచర్ స్పోర్ట్స్, సైక్లింగ్, ఆధ్యాత్మిక పర్యాటకానికి ఇది కేరాఫ్ అడ్రస్‌గా నిలవనుంది. దీంతో ప్రకృతి రమణీయతకు నిలయమైన అనంతగిరి రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి.