పాక్ గూఢచారి వలలో రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్
అసోంలో రిటైర్డ్ ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్ కులేంద్ర శర్మను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతడికి పాకిస్తాన్ గూఢచారి సంస్థతో లింకులు ఉన్నాయని, దేశ భద్రతకు సంబంధించిన సీక్రెట్స్ లీక్ చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. తేజ్‌పూర్ ఎయిర్ బేస్‌లో పని చేసిన ఇతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న ఫోన్, లాప్‌టాప్‌లో కీలక సమాచారం లభించింది. పూర్తి వివరాలు విచారంలో తేలాల్సి ఉంది.