VIDEO: ఏటీ అగ్రహారంలో పొంగిపొర్లిన పీకలవాగు

VIDEO:  ఏటీ అగ్రహారంలో పొంగిపొర్లిన పీకలవాగు

GNTR: గుంటూరు నగరంలో ఆదివారం కురిసిన భారీ వర్షం శివారు ప్రాంతాలను మాత్రమే కాకుండా ప్రధాన వీధులను ముంచెత్తితింది. ఏటీ అగ్రహారంలో పీకల వాగు నిండి రోడ్డు పైకి మోకళ్లలోతు నీరు చేరింది. దీంతో రాకపోకలు సాగించడానికి ప్రజలు భయాందోళన చెందారు. గతంలో కూడా వర్షం పడినప్పుడు పీకలవాగు పొంగి పొర్లి ఓ చిన్నారి ప్రాణాన్ని బలితీసుకుంది.