VIDEO: కీలపట్లలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు

CTR: కీలపట్ల పంచాయతీలోని యానాది కాలనిలో శనివారం సర్పంచ్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ముమ్మరంగా పారిశుద్ధ్య పనులు చేపట్టారు. వర్షాలతో డ్రైనేజ్ నిండిపోవడంతో జేసీబీ ద్వారా పూడిక మట్టిని తొలగించారు. కాలనీల్లో సైతం మురికి కాలువల్లోని చెత్తను తొలగించారు. అలాగే రోడ్డు ప్రక్కన ఉన్న చెత్త దిబ్బలు, పిచ్చిమొక్కలు తొలగించారు.