'దిత్వా'పై వైద్య శాఖ అప్రమత్తం: మంత్రి
ATP: 'దిత్వా' తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. ప్రభావిత పది జిల్లాల్లో రానున్న 15 రోజుల్లో ప్రసవానికి దగ్గర్లో ఉన్న 7,871 మంది గర్భిణులను గుర్తించారు. వీరిలో ఇప్పటికే 375 మందిని ముందు జాగ్రత్తగా ఆసుపత్రులకు తరలించారు. ఈ విషయమై మంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఉన్నతాధికారులతో సమీక్షించారు.