రాచర్ల మండలంలో పత్తి పంట నష్టం
ప్రకాశం: రాచర్ల మండలంలో తుఫాన్ కారణంగా నష్టపోయిన పత్తి పొలాలను వ్యవసాయ అధికారి మహబూబ్ బాషా పరిశీలించారు. గంగంపల్లి, అనుముల వీడు, రామాపురం, సోమిదేవుపల్లి, వదుల వాగుపల్లి గ్రామాలలో పత్తి కాయ దశలో ఉండటంతో అధిక నష్టం వాటిల్లిందన్నారు. సుమారు 625 హెక్టార్ల పత్తి, 40 హెక్టార్ల కంది, 14 హెక్టార్ల వరి నష్టపోయినట్లు ప్రాథమిక అంచనా వేశామన్నారు.