ముగ్గులతో 'ఆదోని జిల్లా' నిరసన.. వినూత్న డిమాండ్
కర్నూలు: ఆదోని పట్టణంలో భోగి పండుగ వేళ మహిళలు వినూత్నంగా తమ ఆకాంక్షను చాటారు. ఆదోనిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఇంటి ముందు ప్రత్యేకమైన ముగ్గులు వేశారు. పాతని విడిచి కొత్తని ఆహ్వానించే భోగి పండుగ రోజైనా ఆదోని ప్రాంతానికి కొత్త జిల్లా గుర్తింపు రావాలని వారు కోరుకున్నారు. ప్రజల డిమాండ్‌ను ప్రతిబింబించేలా ముగ్గులు వేశారు.