జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించిన కలెక్టర్
PLD: నైపుణ్య అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 22వ తేదీన వినుకొండలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృత్తికా శుక్లా తెలిపారు. కలెక్టరేట్‌లో దీనికి సంబంధించిన గోడ పత్రికలను జిల్లా నైపుణ్య అభివృద్ధి సంస్థ అధికారులతో కలిసి బుధవారం ఆవిష్కరించారు. ఈ జాబ్ మేళాలో 35 కంపెనీలు పాల్గొంటాయన్నారు. అర్హతను బట్టి రూ. 35 వేల వరకు జీతం లభిస్తుందన్నారు.