‘10వ తరగతి పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్’
PPM: రేపటి నుంచి ఏప్రిల్ ఒకటివరకు 10వ తరగతి పరీక్షలు జరుగుతున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ మాధవరెడ్డి బందోబస్తు విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇవాళ పలు సూచనలు చేశారు. పరీక్ష కేంద్రంలోని ఎటువంటి ఎలెక్ట్రానిక్ పరికరాలు లోనికి అనుమతించబోమని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు ఎస్పీ చెప్పారు.