VIDEO: స్నానపు ఘాట్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

VIDEO: స్నానపు ఘాట్ వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు

కోనసీమ: మామిడికుదురు మండలం అప్పనపల్లి శ్రీ బాల బాలాజీ స్వామి ఆలయ స్నాన ఘట్టం వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. గోదావరి నీటి మట్టం పెరుగుతున్నందున స్నాన ఘట్టం వద్ద ప్రవాహ వేగం ఎక్కువగా ఉంది. దీంతో ఆలయ ఈవో వి. సత్యనారాయణ ఆధ్వర్యంలో 'లోపలికి వెళ్లొద్దు, లోతు వడి ప్రమాదకరం' అంటూ ఉన్న హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.