SIR తుది జాబితాలో మాజీ ఎంపీ పేరు గల్లంతు
బెంగాల్‌లో SIR తర్వాత రిలీజ్ చేసిన ఓటర్ల జాబితాలో మాజీ ఎంపీ పేరు గల్లంతవ్వడం చర్చనీయాంశమైంది. దక్షిణ హౌరా నియోజకవర్గంలోని 279 నెంబర్ బూత్ నుంచి లోక్‌సభ మాజీ ఎంపీ తరుణ్ పేరు గల్లంతైంది. అయితే ఈ జాబితాలో ఆయన భార్య పేరు ఉండటం విశేషం. 2009లో SUCI నుంచి గెలుపొందిన తరుణ్ పేరు జాబితాలో లేకపోవడం గమనార్హం. కాగా ఆయన పేరును అండర్ కన్సిడరేషన్ కేటగిరిలో ఉంచినట్లు సమాచారం.