ఘనంగా సత్యసాయి వార్షికోత్సవ వేడుకలు
SKLM: పలాసలోని శ్రీ సత్యసాయి సేవా సమితి ఆధ్వర్యంలో 27వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం సామూహిక శతగళార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సత్యసాయి బాబా చిత్రపటాన్ని పల్లకిలో తిరువీధుల్లో ఊరేగింపుగా తీసుకుపోయారు. ఈ కార్యక్రమంలో వందలాదిమంది మహిళలు పాల్గొన్నారు. దీంతో ఆ ప్రాంతమంతా సత్యసాయి కీర్తనలతో మారు మ్రోగింది.