నేడు ఈ ప్రాంతాల్లో పవర్ కట్

MDK: మెదక్ హౌసింగ్ బోర్డ్, ఔరంగాబాద్, అవుసులపల్లి పరిధిలో శుక్రవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ మోహన్ బాబు, ఏఈ నవీన్ కుమార్ తెలిపారు. ట్రీ కటింగ్, ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల నేపథ్యంలో హౌసింగ్ బోర్డు 11 కేవీ ఫీడర్ పరిధిలో ఉదయం 8 నుంచి 12 గంటల వరకు సరఫరా నిలిచిపోతుందని, వినియోగదారులు సహకరించాలని కోరారు.