'కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేస్తోంది'

PPM: సీతంపేట మండలం, ముత్యాలు గ్రామంలో 'బాబు ష్యూరిటీ - మోసం గ్యారంటీ' కార్యక్రమాన్ని పాలకొండ మాజీ ఎమ్మెల్యే కళావతి నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల వారిని మోసం చేస్తూ దగా పాలన చేస్తోందని ఆమె మండిపడ్డారు. రేషన్ తెచ్చుకోవాలంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని, గిరిజన ప్రాంతాల్లో రేషన్ అందించకపోవడం కూటమి వైఫల్యమైందని అన్నారు.