'పారిశుధ్య నిర్వహణలో అలసత్వం సహించం'

'పారిశుధ్య నిర్వహణలో అలసత్వం సహించం'

KKD: నగరంలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎలాంటి అలసత్వం సహించబోమని నగర పాలక సంస్థ కమీషనర్ ఎన్‌వివి. సత్యనారాయణ హెచ్చరించారు. బుధవారం నగరంలోని ఏటిమొగ ప్రాంతంలో ఆయన విస్తృతంగా పర్యటించి పారిశుద్ధ్య పనులను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా కమీషనర్ ఇంటింటికీ వెళ్లి ప్రజలతో మాట్లాడారు. ప్రతిరోజూ శానిటేషన్ వర్కర్లు వస్తున్నారా అని ప్రశ్నించారు.