జిల్లాలో వేసవి సెగలు
అన్నమయ్య: జిల్లాలో వేసవి సెగలు మొదలయ్యాయి. గత కొద్దిరోజులుగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 10 గంటల నుండే ఎండ తీవ్రత పెరగడంతో రహదారులు నిర్మానుష్యంగా మారుతున్నాయి. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో వాతావరణం విభిన్నంగా కనిపిస్తోంది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండ దంచికొడుతుండగా, సాయంత్రం వేళల్లో కొన్ని చోట్ల జల్లులు కురుస్తున్నాయి.