'ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి'

'ప్రజావాణి దరఖాస్తులను సత్వరం పరిష్కరించాలి'

KNR: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి సత్వరం పరిష్కరించాలని కలెక్టర్ చిత్రా మిశ్రా వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో ప్రజావాణి నిర్వహించారు. అదనపు కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్డీవోలు రమేష్ బాబు, మహేశ్వర్‌తో కలిసి ప్రజల నుంచి 223 ఫిర్యాదులు స్వీకరించినట్లు వెల్లడించారు.