VIDEO: ఆలయ చెంతన ఆకట్టుకున్న సూపర్ మూన్
SRCL: కార్తీక పౌర్ణమి సందర్భంగా నిండుపున్నమి వేళ నిన్న రాత్రి వెన్నెల మెరిసింది. రుద్రంగి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ చెంతన చంద్రుడు నిండు జాబిలై, గోపురాల చెంతకు చేరడంతో భక్తులు తన్మయత్వంతో తిలకించారు. కార్తీక పౌర్ణమి వేళ ఆకాశంలో సూపర్ మూన్ ఆకట్టుకుంది. చంద్రుడు ఇలా భూమికి సమీపంగా రావడం ఈ ఏడాది రెండవసారి అని పేర్కొన్నారు.