సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మృతి!

సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మృతి!

TG: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓ సర్పంచ్ అభ్యర్థి గుండెపోటుతో మరణించారు. వేములవాడ అర్బన్ మండలం చింతల్ ఠాణా ఆర్అండ్ఆర్ కాలనీ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్ అవ్వగా.. బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థిగా చెర్ల మురళి అనే వ్యక్తి నామినేషన్ వేశారు. మురళికి కత్తెర గుర్తు వచ్చింది. ఈ క్రమంలో ఆయన చనిపోవడంతో.. అక్కడ ఎన్నిక నిలిచిపోయే ఛాన్స్ ఉంది.