VIDEO: తెనాలిలో ట్రాఫిక్ జామ్..ర్యాలీతో నిలిచిపోయిన వాహనాలు
GNTR: తెనాలి మార్కెట్ యార్డ్ కమిటీ ప్రమాణ స్వీకారం సందర్భంగా నిర్వహించిన భారీ ర్యాలీతో శనివారం రాత్రి పట్టణంలో ట్రాఫిక్ స్తంభించిపోయింది. ముందస్తుగా వాహనాల మళ్లింపు చేపట్టకపోవడంతో గంటల తరబడి వాహనాలు బారులు తీరాయి. చివరకు అంబులెన్స్‌లు కూడా ట్రాఫిక్‌లో చిక్కుకుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.