మంత్రి దృష్టికి వచ్చిన సమస్యల సత్వర పరిష్కారం

సత్యసాయి: ధర్మవరం పట్టణంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ మంగళవారం ధర్మవరం పర్యటన సందర్భంగా ప్రజలు ఇచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కారం చేస్తున్నట్లు మంత్రి కార్యాలయ సిబ్బంది తెలిపారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో బుధవారం ప్రజల సమస్యల అర్జీలు సమర్పించి వాటిని పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి మంత్రి సమస్యలను పరిష్కరించారు.