పలు కార్యక్రమాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు

పలు కార్యక్రమాల్లో పాల్గొన్న డీసీసీ అధ్యక్షుడు

HNK: నడికూడ మండలంలోని పులిగిళ్ళ, నర్సక్కపల్లి గ్రామాల్లో డీసీసీ అధ్యక్షులు, కుడా ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి ఇవాళ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలు శుభకార్యాల్లో పాల్గొని సందడి చేశారు. పులిగిళ్ళలో కాంగ్రెస్ యువ నాయకులు డెంగు ప్రవీణ్ నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. నర్సక్కపల్లిలో వివాహ వేడుకల్లో పాల్గొని, నూతన దంపతులను ఆశీర్వదించారు.