రైతులకు వంగూరు ఏవో సూచనలు
NGKL: పీఎం కిసాన్, రైతు భరోసా, ఫార్మర్ రిజిస్ట్రీ వంటి పథకాల కోసం రైతులందరూ ఒకే ఫోన్ నంబర్ను అనుసంధానం చేసుకోవాలని వంగూరు ఏవో ప్రియదర్శిని సూచించారు. నంబర్ మార్పు లేదా లింక్ చేసుకోవడానికి ఏప్రిల్ 20 చివరి తేదీ అని ఆమె స్పష్టం చేశారు. ఆసక్తి ఉన్న రైతులు వెంటనే తమ ప్రాంత ఏఈవోలను (AEO) సంప్రదించి ఈ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని కోరారు.