నిర్వహణపై అభిప్రాయం తెలపండి: కమిషనర్

కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని అన్న క్యాంటీన్ల నిర్వహణపై ప్రజలు అభిప్రాయం తెలుపాలని నగర పాలక సంస్థ కమిషనర్ యస్. రవీంద్ర బాబు కోరారు. పరిమళ నగర్లోని అన్న క్యాంటీన్‌ను కమిషనర్ ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడ ఉన్న ప్రజలను ఆహార రుచి అడిగి తెలుసుకున్నారు. ప్రతి క్యాంటీన్ వద్ద క్యూఆర్ కోడ్ ఉంటుందని అభిప్రాయాలను తెలుపవచ్చని సూచించారు.