మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య

మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య

SRD: పాపన్నపేట మండలంలోని కొత్తపల్లి గ్రామంలో కుటుంబ కలహాలతో యువకుడు ప్రభుత్వ స్కూల్ ఆవరణలో ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన గడ్డమీద ఉమామహేశ్వర్ (23) సోమవారం ఇంటి వద్ద కుటుంబీకుల మధ్య గొడవ తలెత్తడంతో మనస్థాపం చెంది, స్థానిక పాఠశాలలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.