నేడు సంతకాల ప్రతులు అనకాపల్లి తరలింపు
మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాడుగుల నియోజకవర్గంలో 50వేల సంతకాలను సేకరించినట్లు మాజీ మంత్రి బూడి ముత్యాల నాయుడు తెలిపారు. సంతకాల సేకరణ ప్రతులను బుధవారం ప్రత్యేక వాహనంలో తారువ నుంచి అనకాపల్లి జిల్లా వైసీపీ కార్యాలయానికి తరలిస్తామన్నారు. సంతకాల సేకరణ ప్రతులను తరలించే కార్యక్రమానికి వైసీపీకి చెందిన నాయకులు హాజరు కావాలని కోరారు.