రోడ్ ఎక్కిన వెటర్నరీ విద్యార్థులు

కృష్ణా: గన్నవరం వెటర్నరీ విద్యార్థుల నిరసనలు తీవ్రమయ్యాయి. సోమవారం గన్నవరం వెటర్నరీ కాలేజ్ నుంచి విద్యార్థులు ర్యాలీగా గన్నవరం గాంధీ బొమ్మ సెంటర్ వద్దకు చేరుకున్నారు. గాంధీ బొమ్మ కూడలిలో మానవహారంగా ఏర్పడి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాతీయ రహదారిపై ట్రాఫిక్ స్తంభించింది. విద్యార్థులు నినాదాలు చేస్తూ వారి నిరసనను తెలిపారు.