ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
MHBD: కురవి మండల కేంద్రంలో IKP వారి ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటుచేశారు. ప్రభుత్వ విప్, డోర్నకల్ MLA డా. జాటోత్ రామచంద్రనాయక్ ముఖ్యఅతిథిగా హాజరై మంగళవారం ఈ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, నిబంధనలు అనుసరించి వరి ధాన్యం కొనుగోలు చేయాలని అధికారులకు ఎమ్మెల్యే సూచించారు.