VIDEO: కువైట్‌లో చిక్కుకున్న పిఠాపురం మహిళ

VIDEO: కువైట్‌లో చిక్కుకున్న పిఠాపురం మహిళ

ఇరాన్-ఇజ్రాయిల్ ఉద్రిక్తతల మధ్య కువైట్‌లో పనిచేస్తున్న ఏపీ కాకినాడ జిల్లా పిఠాపురానికి చెందిన దాకే కుమారి ప్రాణభయంతో ఉన్నట్లు వీడియోలో తెలిపింది. తనను భారత్‌కు రప్పించాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్‌ను సెల్ఫీ వీడియో ద్వారా వేడుకున్నది. చుట్టుపక్కల ఉన్న యుద్ధ వాతావరణాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసింది.