శ్రీవారిని దర్శించుకోనున్న నిర్మలా సీతారామన్

శ్రీవారిని దర్శించుకోనున్న నిర్మలా సీతారామన్

AP: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. ఈ సందర్భంగా అతిథి గృహం వద్ద ఆమెకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు. ఆమె వెంట కుటుంబ సభ్యులు, అధికారులు ఉన్నారు. శ్రీవారి దర్శనానంతరం ఆమె పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం.