VIDEO: వెంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు
WGL: రాయపర్తి మండలం వెంకటేశ్వరపల్లిలోని స్వయంవ్యక్త శ్రీ వెంకటేశ్వరస్వామి (సన్నూరు) వార్షిక అధ్యయన బ్రహ్మోత్సవాలు-2026 వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి ఉత్సవ అనుజ్ఞ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ద్వాదశి రోజున విష్వక్సేనారాధన, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురారోపణ, శాస్త్రోక్తంగా జరిగాయి.