పెట్రోల్ పోసి వ్యక్తిని కాల్చేశారు

SDPT: ములుగు పీఎస్ పరిధిలోని బస్వాపూర్ శివారులో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన చోటుచేసుకుంది. గజ్వేల్ రూరల్ సీఐ మహేందర్ రెడ్డి వివరాలిలా.. వ్యక్తిని ఎవరో పెట్రోల్ పోసి నిప్పంటించి, చంపేసినట్లు కనబడుతుందన్నారు. మృతుడి వయసు 30-35 ఉంటుందని, డెడ్ బాడీ వివరాలు ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.