బైక్, లారీ ఢీ.. ఒకరు మృతి
ELR: ఉంగుటూరు మండలం నారాయణపురం వద్ద నిన్న రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. బైక్‌ని లారీ ఢీ కొట్టిన ఘటనలో ఒకరు మృతిచెందగా మరొకరు గాయపడ్డారు. పోలీసుల వివరాలు.. కైకరానికి చెందిన కొనకళ్ల సత్యనారాయణ (38) తలపై నుంచి లారీ వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గణేశ్‌కు స్వల్ప గాయాలయ్యాయి. మృతునికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ ఘటనపై ఎస్సై కేసు నమోదు చేశారు.