'వరహాల గెడ్డను రక్షించండి'

'వరహాల గెడ్డను రక్షించండి'

పార్వతీపురం పట్టణం నడిబొడ్డున ప్రవహిస్తూ ప్రకృతి వరంగా లభించిన వరహాలు గెడ్డను రాబందుల నుండి రక్షించాలని భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ సందర్భంగా ఆ పార్టీ ఓబీసీ జిల్లా ఛైర్మన్ వంగల దాలి నాయుడు సోమవారం కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డిని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇటీవల వరహాల గెడ్డను కొంతమంది ఆక్రమించారన్నారు.